Telangana Govt Social Welfare Gurukula Paatashalamore

Telangana Govt Social Welfare Gurukula Paatashala తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధం చేస్తుంది.

ఈ లక్ష్యంతో SC, ST, BC, మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ | గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై తేదీ 23-02-2025 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో)

ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు క్రింది వెబ్సైట్లను దర్శించండి. https://tgswreis.telangana.gov.in (లేదా) https://tgtwgurukulam. |telangana.gov.in (లేదా) https://miptbcwreis.telangana.gov.in | (లేదా) https://tgcet.cgg.gov.in

Social Welfare Gurukula Paatashala

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు

1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేది 21-12-2024 నుండి 1-2-2025 వరకు ఆన్ లైన్లో రూ.100/- రుసుము చెల్లించి ధరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్ తో ఒక ధరఖాస్తు మాత్రమే చేయవచ్చును.

2. అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును.

3. విద్యార్థుల ఎంపికకు “పాతజిల్లా” ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది.

4. అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

Telangana Govt Social Welfare Gurukula Paatashala

మన గురుకులాలు

విద్యార్థుల ప్రగతికి సోపానాలు

సం/- డా॥ వి.యస్. అలగు వర్షిణి, ఐ.ఏ.ఎస్

Secretary, TGSWREIS & Chief Convenor, VTG CET-2025

TGSWREIS-040-23391598

TGTWREIS-9491063511

MJPTBCWREIS-040-23328266 TGREIS-040-24734899

A DIPR R.O. No. 8130-PP/CU/ADVT/1/2024-25, Dt. 19-12-2024

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *