Shivarathri Adbutamima Song Lyrics in Telugumore

Shivarathri Adbutamima Song Lyrics in Telugu ఈ శివరాత్రికి అద్భుతమైన శివుని పాట find below song listen you feel definately happy and comment

ఆటగదరా శివ ఆటగదరా శివ

ఏమని పాడను పాట కదరా శివ

ఆటగదరా శివ ఆటగదరా శివ

ఏమని పాడను పాటగదరా శివ

దేహాల మూటల్ని, రక్తాలు పూతల్ని

కన్నతల్లి కడుపు కోతలే నీకు

ఇంబడుతలేదా నీకు కనబడుతలేదా..

ఇంబడుతలేదా నీకు కనబడుతలేదా..

శివరాత్రి నీపూజకై

మేము ఉపవాసముంటాములే

(ఎందుకో ఎందుకో)

ఎములాడ రాజన్నకే

పదివేల దండాలు పెడతాములే

భవభావా బంధాల

బలహీన బతుకుల్ల కన్నీటి తోడెవ్వరూ

మడుగుల్ల అడుగైతె

కష్టాల కడలైతే మా ఎదురుజాడెవ్వరూ

జగమేలే జంగమా జాలి లేదా నీకు

ఆ తల్లి ఎద గోస సెవి సేరదా నీకు

గొంతు పగిలేల పిలిచినా పలకవెందుకురా

ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా

ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా

శంకరా శంకరా జయహో

శంకరా శంకరా నమహో

శంకరా శంకరా జయహో

శంకరా శంకరా నమహో

నువ్వు ఆడించె ఈ ఆటలో

కీలుబొమ్మలం అయ్యాములే

(ఔనులే ఔనులే)

సావుపుటుకలో నీ సేతిలో

చివరికి చేరేము నీ గూటిలో

Indrajit Dilip devgan Hanumanth combination folk awesome

పసిబిడ్డ తొలిశ్వాస ముసలికొన తుదిగోస

ఆడేటి గాలెవ్వరూ

బ్రతుకంటు బతుకిచ్చి, బంధాలనెడబాపి

ఎటుగాని బతుకెందుకూ…..

ఏ దిక్కు మొక్కినా నువ్వే కదా ఈశ్వరా

నీ కన్నబిడ్డలం దయ చూపు శంకరా

నీటిబుడగంటి మా బతుకు, కోపమెందుకురా…..

ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా

ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *