N T R , K V REDDY Untold Facts in between what are those know the story and what you realize comment b:elow వూరికే ఎవరు మహాను భావులు కారు!!!
ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఒక మాట
చరిత్ర లో ఒక విషయం ఏమిటంటే దర్శకుడు కె వి రెడ్డి గారి కొడుకు అమెరికా వెళ్ళడానికి డబ్బులు కోసం, ఎన్టీఆర్ దగ్గరకు వెళితే డబ్బిచ్చి పంపారు.
1971 లో కె వి రెడ్డి గారికి ఆరోగ్యం బాగోలేదని పరామర్శించడానికి వెళ్లిన అన్న ఎన్టీఆర్, కె వి రెడ్డి గారిని చూసి చలించిపోయి ఒక సినిమా ” శ్రీకృష్ణసత్య నా బ్యానర్ లొ తీద్దాం. మీరు దర్శకత్వం వహించండి” అని అడగగా “నేను చేయలేను” అని కె వి రెడ్డి గారు అనగా,
N T R , K V REDDY Untold Facts in Telugu
- Pushpa 2 Alluarjun Reaction on Lady Death
- NTPC Jobs in India 2024-2025
- Inspirational Story in Telugu for Bussiness
“మీరేమి చేయొద్దు. సెట్ కి వచ్చి కూర్చోండి నేను దర్శకత్వం చేస్తాను కానీ దర్శకునిగా మీ పేరు వేస్తాను” అని ప్రతిరోజూ ఆయనకు కారు పంపి ఆయన రాగానే ఆయనకు నమస్కరించి షూటింగ్ మొదలుపెట్టేవారు.
సినిమా అయిపోయాక కొంత డబ్బు తీసుకెళ్లి కె వి రెడ్డి గారి చేతిలో పెడితే ఆయన అన్న మాటలు…. “మిస్టర్ ఎన్టీఆర్ నేను చాలామందికి దారి చూపాను కానీ ఇలా ఎవరు చేయలేదు. నిన్ను మరువలేను నేను నీకు మళ్ళీ ఇవ్వాలి కదా వద్దులే” అనగా
ఎన్టీఆర్ బదులు ఇస్తూ “మీ చేతిలో పెరిగిన నా ఎదుగుదల మీకు ఉపయోగపడడం గురుదక్షిణ రెడ్డిగారు” అని ఆయనకు నమస్కరించి వచ్చారు.
ఇది యాదార్ధంగా జరిగిన సంఘటన. ఇందుకు సి. నారాయణ రెడ్డిగారు సాక్ష్యం ఆయన ఆత్మ కథ లోనే చెప్పారు.
అన్న ఎన్టీఆర్ చనిపోయిన రోజు వెక్కి వెక్కి ఏడ్చారు సి. నారాయణ రెడ్డిగారు. అది ఆ మహానుభావుడికి కులమతప్రాంత రహితంగా ఆనాటి ప్రముఖులు ఇచ్చిన గౌరవమర్యాదలు.