Malabaddakam Constipation Tips to relieve constipation మలబద్ధకము తగ్గడానికి చిట్కాలు Tips to relieve constipation మలబద్ధకము తో బాధ పడుతున్నారా ఇకపై అలాంటి సమస్య లేకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ ట్రై చేయండి మీకు ఉపయోగపడొచ్చు
మలబద్ధకము తగ్గడానికి చిట్కాలు
సమస్తరోగ వర్ధకం మలబద్ధకం అన్నారు! విరేచనం సరిగాకాని వ్యక్తులకు కీళ్ళ నొప్పులతో మొదలు పెట్టి పక్షవాతం వరకూ అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం వుందని ఒకసారి మలబద్ధకం ఏర్పడిన తర్వాత విరేచనం ఫ్రీగా అయ్యేలా చేసుకోవడానికి మనిషి. తపించిపోవలసి వస్తుంది!
చుట్ట, బీడీ, సిగరెట్లు తాగితేగాని, విరేచనం కాదని, పేపరు చదివితేగాని విరేచనం కాదని లేనిపోని వంకలు పెట్టుకొని విరేచనానికి వెళ్ళడాన్ని వాయిదా వేసుకో కండి! నిజానికి పొగత్రాగడంగాని, పేపరుచదవడంగాని, కాఫీ, టీలు త్రాగడంగానీ, విరేచనం ఫ్రీ అయ్యేందుకు ఏమాత్రం సహకరించేవి కావు. అవన్నీ మనకు మనం పెట్టుకునే వంకలే! రోజూ సరిగ్గా సమయానికి ఫ్రీగా విరేచనానికి వెళ్ళండి! వ్యాధులు, మీ జోలికి రావు.
1. బీన్స్, సోయాబీన్స్, చిక్కుడు, అలసందలు, బొబ్బర్లు ఇలాంటి ఆహారపదార్థాలలో ఫైబర్ ఎక్కువ వుంటంది. కాబట్టి, వీటిని ఎక్కువగా తీసుకుంటే విరేచనం ఫ్రీగా. అవుతుందని ఆధునిక శాస్త్రం చెబుతుంది.
2. అల్లం మెత్తగా దంచి, తగినంత సైంధవలవణం అందులో కలిపి ఒక సీసాలో నిలవ వుంచుకోండి. రోజూ అన్నంలో మొదటి ముద్దగా 1/4 చెంచా మోతాదులో నెయ్యి వేసుకుని తినండి. విరేచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అన్నహితవు కలుగుతుంది.
3. ఆముదం మంచిది తెచ్చుకొని, దాంతో ఆహారపదార్ధాలు వందుకొంటే చాలా మంచిది. ఆముదంలో వండిన గారెలు ఈ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి. ఆముదాన్ని నేరుగా తీసుకున్నా మంచిదే! మలబద్ధకం వున్న రోగులకు ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం ఆముదము
Tips to relieve constipation
4గులాబీ పువ్వు లు రేకుల్లి
తీసుకొని వాటిని పల్చగా పొరలా పళ్ళెంలో పరవండి. దాని మీద పంచదార చల్లండి. పైన మళ్ళీ గులాబీ రేకులు పరవండి. పంచ దార చల్లుతు ఒక పొరలు పొరలుగా గులాబీ రేకులమీద పంచదారచల్లుతూ ఓగా పాత క గా పేర్చి రోజూ నీటితోగానీ, పన్నీటితోగానీ తడపండి. కొన్ని రోజులకు రేకులు, పంచ దార కలిసి మిశ్రమంగా మారి లేహ్యం అవుతుంది. రోజపుష్పలేహ్యం పేరుతో ఇది బ జార్లో దొరుకుతుంది కూడా. దీన్ని రోజూ తీసు కుంటే విరేచనం అవటమే కాకుండా రక్తశుద్ధిని కూడా కల్గిస్తుంది.
చలువ చేస్తుంది.. పైత్యను వ్యాధులన్నింటిలోనూ మంచిది.
5. ఇంగువను నేతిలో వేయించి, మెత్తగా దంచి, శనగగింజంత మాత్రలే కట్టుకుని ఉదయం సాయంత్రం తీసుకొంటే మలద్వారం దగ్గర మంట, నొప్పి, విరేచనంతో నెత్తురు పడ డ o జిగురు తగ్గుతాయి. విరేచనం ఫ్రీగా అవుతుంది.
6 అవాలు ఒక చెందా తీసుకొని చన్నీళ్లతో నూరి త్రాగిస్తే కడుపులో బాధలు తీరతాయి. అధికంగా మూత్ర వెళ్ళడం ఆగుతుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. పొట్ట, కు పేగులకు బలంగా వుంటుంది.
7 ఉప్పు నీళ్ళు వాంతినీ, విరేచనాన్ని అయ్యేలా చేసి పేగుల్ని శుభ్రం చేస్తాయి.
8ధనియాలు, జీలకర్ర, వాము… ఈ మూడింటినీ సమానంగా తీసుకొని నేతిలో మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలోగానీ, టిఫెన్ లోమజ్జిగలో గానీ రోజూ తీసుకొంటే, ఆకలి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది శరీరం తేలికగా వుంటుంది. కడుపులో పాములు పోతాయి. తగ్గుతుంది. పిల్లలకు అజీర్ణం, కడుపులో నొప్పి తగ్గుతాయి. విరేచనం సరిగా అవుతుంది. మూత్రం బంధించినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది
9., ద్రాక్ష యాపిల్, కమలాలవంటి పళ్ళకు విరేచనాన్ని కల్గించే గుణం ఉంది.
Malabadakam tagge manchi chitkalu
10., కొత్తి మిరను ఎంత వీలైతే అంత తరచుగా ఆహార పదార్థాలలో వాడుకొంటూ వుంటే చక్కగా
విరేచనం కల్గిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర ఎండించి, మెత్తగా ఉప్పు కలుపుకొని అన్నంలో తింటే మరీ మంచిది.
11. చింత పండు చారు. రోజూ తాగండి. కడుపులో బేజారుపోయి కాలవిరేచనం.. అవుతుంది.
సునామీకి అకును ఈ చారులో వేసి బాగా మరిగించి తాగితే తప్పకుండా విరేచనం అవుతుంది.
12. బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకొని తినండి. చలవ చేస్తుంది. విరేచనాన్ని లేహ్యం అనే పేరుతో బజార్లో దొరికే మందును తీసుకున్నా
మంచిదే చక్కగా విరేచనం అవుతుంది.
13. లేత ములగాకు కూరని పండుకొని తింటే విరేచనం అవ టమే కాకుండా వాతం తగ్గుతుంది. పక్షవాతం, కీళ్ళవాతం వంటి వాతవ్యాధులన్నింటిలోనూ ఇది మంచిది.
14. సీతాఫలంవేరు ఆకుల కషాయాన్ని తేనె కలిపి తాగితే మలద్వారంలోంచి పేగు బైటకు
వచ్చే వ్యాధి తగ్గుతుందని వస్తుగుణదీపిక అనే వైద్య గ్రంధం చెస్తోంది.
15. సీతాఫలం వేరు ఎక్కువ
విరేచనాలు అయ్యేలా చేస్తుంది. చాలా తక్కువ మోతాదులో ఇస్తే అమీబియాసిస్ వ్యాధిలో జిగురును తగ్గించి, విరేచనాన్ని ఫ్రీగా అయ్యేలా. చేస్తుంది.
16. బొప్పాయిపండు తింటూ వుంటే మలబద్ధకాన్ని కల్గించే ప్రకృతి మారుతుంది.
17. వేపచెట్టుమీద జిగురు సేకరించి, కుంకుడు గింజంత సైజు మాత్ర కట్టుకొని ఉదయం, సాయంత్రం ఒకటి తీసుకొంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురు, తగ్గుతుంది. విరేచన బద్ధకం పోతుంది.
18. ఆకుకూరలు రోజూ తినడం అవసరం. పెరుగుతోటకూర, కొయ్యతోటకూర, పాలకూర, మెంతికూర, పొన్నగంటికూర, గంగవావిలి కూర, చక్రవర్తికూర వాటిలో ఏవి దొరికితే వాటిని రోజూ వండుకొని తినాలి. విరేచనం సాఫీగా అవటమే కాకుండా చలవచేస్తాయి. గోంగూర, పుల్ల బచ్చలి, చుక్కకూర వంటి పుల్ల కూరలు వాతాన్ని కల్గించి, మలబద్ధకాన్నిస్తాయి. అందుకే వీటిని తినేప్పుడు జాగ్రత్తగా వుండాలి.
19. ఉల్లికాడల కూర రుచిగా వుంటుంది. వాతం, మూలవ్యాధులు, మొలలు వగైరా. బాధల్ని తగ్గిస్తుంది. విరేచనం బంధించి సరిగా అవని వారికి తప్పకుండా మేలు చేస్తుంది.
Constipation Tips to relieve health tips to reduce belly fat
20. శుద్ధిగా, శుభ్రంగా వున్న మంచినీటిని బాగా మరిగించి, చల్లార్చి, సబ్బు గిలకరించి
ఆ నీటితో ఎనీమా చేసుకోవడం మంచిది.
మలబద్ధకం మనిషి బద్ధకానికి గుర్తు, బద్దకిస్టుగా బ్రతికే మనిషి వలన ఎంత ఉపయోగం వుంటుందో మనకు తెలుసు. మలబద్ధకం వలన మనిషికి అతని శరీరం కూడా అంతే నిరుపయోగంగా వుంటుంది. జీవితంలో ఏ విజయాలు సాధించలేని అయోగ్యతకు కేవలం మలబద్ధకమే ఒక్కోసారి కారణం అవుతూ వుంటుంది.
ఈ వ్యాధి లక్షణాలు మీలో ఏ మాత్రం కన్పిస్తున్నా ముందు జాగ్రత్తపడండి. ఆ తర్వాత మలబద్దకం అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఆ అనేక వ్యాధులు తిరిగి మలబద్దకాన్ని పెంచుతూ వుంటాయి. ఇలా వ్యాధులూ, మలబద్ధకం పెనవేసుకు పెరుగుతాయి. సమస్త రోగవర్ధకం మలబద్ధకం అన్నదందుకే!