mahilalaku goodnews

మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2500, మార్చి 8నుంచి జమ

మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధం అయింది. ప్రతీ నెల మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన మహిళల అకౌంట్లలో నెలకు రూ.2500 చొప్పున అందించనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 8వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని.. స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీలు

అర్హులైన మహిళలకు నెలకు రూ.2500

• రూ. 500కే గ్యాస్ సిలిండర్.. హోలీ, దీపావళి పండగలకు ఒక్కో ఉచిత సిలిండర్

గర్భిణీలకు రూ.21 వేలు సాయం, 6 పోషకాహార కిట్లు అందజేత • మురికివాడల్లో నివసించే ప్రజలకు రూ.5 లకే భోజనం

ఢిల్లీలోని ప్రజలందరికీ ఉచితంగా రూ.10 లక్షల వైద్య చికిత్స

Mahilalaku Goodnews From March 8

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం.. ఢిల్లీలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యత అని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. మహిళలకు ఆర్థికంగా సహాయం అందించేందుకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కచ్చితంగా నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. మార్చి 8వ తేదీ నాటికి మహిళల ఖాతాల్లో తప్పకుండా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుంది. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22

పానాలతో పతిష్టకానికి పరిమితం అయింది.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *