Goat PIG love Story in Telugu 2024

Goat PIG love Story in Telugu ఒక రైతు కొన్ని మేకలను, కొని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి పేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకును వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉండేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది.

పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు కంపు అవతలికి పో” అని చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడు కుండామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది.

“అమ్మా నాకూ స్నానం చేయిం చవే. ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకో వట్లేదు” అని తల్లితో అంది పందిపిల్ల. “చూడు బంగారం, మనం మన లాగే ఉంటాం. ఇంకోలా ఉండటం. మనకు కుదరదు. మన శరీరానికి చెమటపట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి.” అని తల్లి వివరించి చెప్పింది.

PIG love Story in Telugu

పందిపిల్లకు ఇదంతా అర్ధం చేసు కునే వయసులేదు. కాస్సేపు వాళ్ళమ్మతో గునిసింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది.

ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేక పిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి ఎలా పసికట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండ టంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్ట

యింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పంది పిల్ల.

Goat PIG love Story in Telugu

“ఏయ్ పారిపో త్వరగా పారిపో… నక్కొస్తోంది..” అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది.

మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పంది పిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందువేసి బాగు చేసాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్త నను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత రెండూ ప్రాణస్నేహి తులయ్యాయి

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *