Eerojullo Pelli Chesukunna Tarvata

Eerojullo Pelli Chesukunna Tarvata పెళ్లి చేసుకున్న తరువాత

1. అనారోగ్యం వస్తే భర్త/ భార్య చూస్తుంది అన్న నమ్మకం ఉందా? డబ్బులు సంపాదన/ఓపిక లేకపోతే మొహం అయిన చూస్తుందా?

2. ముసలి వాళ్ళు అయ్యాక కూడా ఉంటారు అన్న నమ్మకం ఉందా? ఉన్నా,   ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఆ ఓపిక ఉందా?

3. అనుభూతులు…బూతులు బాగుంటాయి కానీ అందరికీ అనుకూలవతి దొరకాలి గా ఇప్పుడు జనరేషన్ లో లేరు.

4. గిల్లికజ్జాలు వరకు ఒకే కానీ గ్రడ్జ్ లు పెట్టుకుంటే నే సమస్య.

And one more thing

ఇంతకు ముందు జనరేషన్ దృష్టిలో పెట్టుకొని  అనద్దు…

ఇప్పటి ఉన్నవారితో మాట్లాడి అప్పుడు చెప్పండి.

ఇవన్నీ ఇప్పుడు ట్రాష్.

Eerojullo Pelli Chesukunna Tarvata

మొగుడు అంటే డబ్బు సంపాదించే మెషీన్.

భార్య అంటే toy.

అత్త మామలు అంటే అంటరాని వాళ్ళు.

వారానికి నాలుగు రోజులు బయట ఫుడ్ తినాలి. వండడానికి బద్దకం.

బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ లేని అమ్మాయిని చూపించండి 1% ఉంటారు ఏమో.

అంట్లు తోమే అమ్మాయిలు 10% కూడా లేరు. ఉంటే వారు దేవతలు.

మొగుడికి సరిగ్గా వండి పెట్టే వాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు.

అన్నిటికీ  బద్దకం అయిన రోజులు వచ్చాయి.

Now another side of the coin.

మగవాడికి నీ సాలరీ కావాలి నీ కష్టం కూడా కావాలి. నీకు అంటూ దాచుకోవడానికి ఏమైనా ఉంటుందా?

పిల్లలను కంటే వారి బాధ్యత మొత్తం మీదే …ప్రేమ అనే బంధనాలు అన్ని మీకే ఉంటాయి.. మీకు అంటూ ఫ్రీడమ్ ఉండక పోవచ్చు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాధ్యత లేని మొగుడు దొరికితే దాని కన్న టార్చర్ ఏముంటుంది? నువ్వే కష్టపడాలి నువ్వే అతనిని ఫ్యామిలీ నీ కూడా సాకాలి.

నీకు అనారోగ్యం వస్తె చూస్కునే భర్త దొరికితే అదృష్టం లేకపోతే దురదృష్టం.

ఎంత చేసిన నీకు గుర్తింపు ఉంటుందా?

సాగే వాళ్లకు సాగుతూనే ఉంటుంది. సాగని వాళ్లకు ఎదీ సాగదు.

కాబట్టి పార్టనర్ అనేది మన అదృష్టం బొమ్మ బొరుసు అంతే.

నోట్ : ఇది అందరినీ ఉద్దేశించి కాదు. మెజారిటీ గురించి నేను చూసింది నాకు తెలిసింది మాత్రమే రాశాను. ఎటాక్ చేయకండి

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *