Confession in Telugu 2024

ప్రయత్నం.. Confession in Telugu 2024

అప్పుడు ఆ స్థలం కొని ఉంటే.. ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునే వాడిని..

అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెడితే.. ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని…

అప్పుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకుని ఉంటే.. అప్పుడే అమెరికా వెళ్లి ఉంటే..

‘అప్పుడే.. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా’ అని.. ఇలా చాలామంది అప్పుడప్పుడూ అంటుంటారు. ఈ ‘అప్పుడు’లు అనేవి వారు కన్న (కనే) పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు.

Cheppudu Matalu chinna katha in telugu 2024
more

అప్పుడు చెయ్యలేదు.. సరే.. ఇప్పుడేం చేస్తున్నారంటే..? ‘ఏదో ఒకరోజు’ అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి.. చెదలు పట్ట కుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరు స్తుంటారు.

దాని గురించి మరిచిపోయిన వాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్న వారు

ఏదో ఒకరోజు’ అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి.. చెదలు పట్ట కుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరు స్తుంటారు.

దాని గురించి మరిచిపోయిన వాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్న వారు ‘అ ప్పుడు.. అలా’ అని ఎప్పుడూ మాట్లాడరు.

ప్రయత్నం.. Confession in Telugu 2024

మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే.. ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖా ముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతున్నదో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా??

సమాధానం సానుకూలంగా లేకపోతే.. ‘అప్పుడు’ కాలేదు సరే.. ఇప్పుడైనా మొదలెట్టండి.

కెఎఫ్సీ ఆయన.. ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలెట్టాడో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కెఎఫ్సీ ప్రారంభించాడో ఎప్పు డైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు.. కానీ, ప్రయత్నించడంలోనే ఓడిపోతే.. అది కచ్చితంగా మీ తప్పే.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *