చెప్పడుమాటలు
భీమయ్యా, సోమయ్యా చాలాకోలం నుంచి మంచి స్నేహితులు. ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి. భీమయ్యమీద సోమయ్య, సోమయ్యమీద భీమయ్య ద్వేషం పెంచుకున్నారు.
ఒకసారి ఊరిబయట శివాలయందగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు. అప్పుడు భీమయ్య కలుగజేసుకుని, “అదిగో, సోమయ్యా! మనిషి అయ్యాక ముందూ, వెనకా ఆలోచించాలి. ఎవరు చెలితే వాళ్ళదే నిజమని గుద్దిగా తల ఊపరాదు,” అన్నాడు.
“నువ్వేం అంటున్నావో, నాకు అర్థంకావడం లేదు,” అన్నాడు సోమయ్య.
“ఎలా అర్థమవుతుందిలే! చెడు కోరి వాళ్ళమాటలయితే, నీకు అర్థం అవుతాయి,” అన్నాడు భీమయ్య.
*వివరంగా చెప్పాలిగాని, ఆ ఎత్తి పొడుపులెందుకు ?” అన్నాడు సోమకు.
Cheppudu Matalu katha in telugu 2024
“అదే చంద్రయ్య చెప్పడుమాటలు విని, నామీద కక్ష పెంచుకున్నావట! నా అంతు చూస్తానని కూడా అన్నావట. ఎవరైనా గిట్టక ఏదైనా చెడుగా చెబితే, వెంటనే నమ్మడమేనా?” అని ప్రశ్నించాడు భీమయ్య.
” అవునూ! అంతకూ నేనలా నిన్ను అనరానిమాటలన్నానని, నువ్వెలా అనుకుంటు న్నావు?” అని అడిగాడు సోమయ్య,
* ఆ కామయ్య చెప్పాడులే అంతా!” అన్నాడు భీమయ్య.
“చెప్పుడు మాటలు వినరాదని నాకు చెబుతూ, చివరికి నువ్వు చేసిందేమిటి?” అంటూ నవ్వసాగాడు సోమయ్య,
భీమయ్యకు దానితో సంగతి అర్థమై, తన
నవ్వసాగాడు.