Ananth Ambani Weds Radhika in 2024 on Friday July పెళ్లి అయ్యింది!
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని మిలియనీర్లు, సెలబ్రిటీలు ఎదురు చూసిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి జరిగింది శుక్రవారం రాత్రి ముంబై కుర్తా లోని జియో కాంప్లెక్స్ సెంటర్ లో! అతిరధ మహారధులు హాజరయ్యారు కరోనా రిపోర్ట్స్ తీసుకుని! అవును, ఎంత ఉన్నోడైనా ఎంట్రీ మాత్రం కరోనా రిపోర్ట్ చూపిస్తేనే ముందుకు! బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా ఉందని తేలడంతో ఆయన హోమ్ క్వారంటైన్ కు పరిమితం అయిపోయారు! అంబానీ ఇంట పెళ్లితో ఇంకా కరోనా తల్లి మనదేశంలోనే ఉందని తేలిపోయింది!
మొత్తానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా! చాప్టర్ విమానాలు, అక్కడ నుంచి అత్యంత ఖరీదైన కార్లు, ఖరీదైన కానుకలు వెరసి ఆసియాలోనే అత్యంతగా ఖర్చు పెట్టిన తొలి మహా ధనిక వివాహం గా చెప్పుకోవచ్చు! రికార్డులకు ఎక్కించవచ్చు!
బారాత్ లో రజనీకాంత్ తమిళ్ పంచె కట్టి అనంత్ ముందు నృత్యాలు చేసారంటేనే ఆ వివాహ వైభోగం తెలుస్తోంది! అమితాబ్, అనిల్ కపూర్, షారుఖ్ నుంచి మన రామ్ చరణ్ వరకు దాదాపు సెలబ్రిటీలంతా డ్యాన్సులు చేశారు! దాదాపు రెండేళ్లుగా కొనసాగిన పెళ్లి తంతు! ఇవాళ శుభాశీస్సులు పండుగ చేసుకుంటున్నారు! రేపు ఆదివారం రిసెప్షన్ తో వేడుకలు ముగిస్తారేమో! ఏమో చెప్పలేం!
Ananth Ambani Weds Radhika on Friday
83 కోట్లు పెట్టి రాక్ స్టార్ జెస్టిన్ బృందం, 50 కోట్ల తో పాప్ సింగర్ రీమా బృందం ఒకెత్తు అయితే, దక్షిణాది నుంచి మన వీణ కళాకారిణి శ్రీవాణి కి ఈ వేడుకల్లో పెద్ద పీట వేశారు! పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో తెలుగుదనం, భారతీయతను తన వీణ వాద్య ప్రతిభతో సెలబ్రిటీల మనసులు దోచుకున్నారు!
హైదరాబాద్ కు చెందిన వీణ శ్రీవాణి గురించి ప్రత్యేక పరిచయ వాక్యాలు అక్కరలేదు! ఆమె ఈటీవీ యాంకర్ గా అందరికి సుపరిచితురాలే! సంచలన వివాదాల వేణు స్వామి భార్య శ్రీవాణి! ఇంత అతి పెద్ద వివాహ వేడుకల్లో నీతా అంబానీ ప్రత్యేకంగా వీణ శ్రీవాణి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం! అభినందనలు శ్రీవాణి గారు! అలాగే హైదరాబాద్ నుంచి విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, దగ్గుబాటి రాణా తదితరులు పాల్గొనడం విశేషం!