Agamma Agaradhe Making and Lyrics in Telugumore songs

Agamma Agaradhe Making and Lyrics in Telugu

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి

నా గుండె గదులల్లో గంతులేసావే

మందలించి పోతివే, పిల్ల

మనసు దోసుకుంటివే

పొద్ధస్తు నా సుట్టు తిరుగుతుంటవు

పని పాట లేనట్టు ఆగమైతావు

వద్దంటే వినకుండానే

నిన్ను ప్రేమించమని అంటవూ

ఆగమ్మ ఆగరాదే రాధమ్మ

బంగారు నా బొమ్మవే

సిత్రాల నా సిన్నివే రాధమ్మ

నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా

నన్నిట్ట ఏం చేస్తవో

నీ మాయ మాటలతోన

నన్నే మొత్తంగ బంధిస్తవో

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి

నా గుండె గదులల్లో గంతులేసావే

మందలించి పోతివే, పిల్ల

Agamma Agaradhe Lyrics in Telugu

మనసు దోసుకుంటివే

సోయగాల నీ సూపులతో

సొమ్మసిల్లంగ ఆ మత్తు జల్లినవే

ఇల్లు జాడ మరిసి నీ కోసమే

కాపుకాసి ఎదురు చూస్తుంటినే

నన్నింక మెప్పించే నీ ప్రేమలో

నీ వైపుకే నన్ను మళ్ళిస్తివే

నా నీడ నాతోడు విడిచిపోయెనే

నీ తీరుగా నేను నువ్వైతినే

వాగు వంకల తీరు

వరి చేల అందాలు

మన ప్రేమకే గుర్తులు

వాగు వంకల తీరు

వరి చేల అందాలు

మన ప్రేమకే గుర్తులు

నీకు నాకు మధ్య సాక్ష్యంగా

మిగిలేరు ఈ పంచ భూతాలు

ఈ పంచ భూతాలు

పొద్ధస్తు నా సుట్టు తిరుగుతుంటవు

పని పాట లేనట్టు ఆగమైతావు

వద్దంటే వినకుండానే

నిన్ను ప్రేమించమని అంటవూ

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి

నా గుండె గదులల్లో గంతులేసావే

మందలించి పోతివే, పిల్ల

మనసు దోసుకుంటివే

మనసిచ్చిన నీకు మాటిచ్చినానమ్మ

మనసారా మనువాడుకుంటానని

Agamma Agaradhe Making and Lyrics in Telugu

పది కాలాలు గుండెల్లో దాసుకుంటానే

నిన్ను విడిచి ఏడ పోనని

నీ కౌగిట్లో సరసంగ చేరుకొని

నా తనువంతా నీకే పంచుకుంట

జన్మంతా నీ చెంత ఉండిపోగ

నా బతుకంతా నీకే ఇచ్చుకుంట

ఈనాటి అనుబందమేనాటిదో అంటూ

మనమిట్ల మురిసిపోగా

ramalachimi part 2 eppudu in telugu
folks

ఈనాటి అనుబందమేనాటిదో అంటూ

మనమిట్ల మురిసిపోగా

జన్మ జన్మాలకే ఇంకా వీడిపోని

బంధాన్ని ఆ దేవుడు ముడి వెయ్యగా

ఆ దేవుడు ముడి వెయ్యగా

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి

నా గుండె గదులల్లో గంతులేసావే

మందలించి పోతివే, పిల్ల

మనసు దోసుకుంటివే

పొద్ధస్తు నా సుట్టు తిరుగుతుంటవు

పని పాట లేనట్టు ఆగమైతావు

వద్దంటే వినకుండానే

నిన్ను ప్రేమించమని అంటవూ

బంగారు నా బొమ్మవే

సిత్రాల నా సిన్నివే రాధమ్మ

నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా

నన్నిట్ట ఏం చేస్తవో

నీ మాయ మాటలతోన

నన్నే మొత్తంగ బంధిస్తవో

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *