30 నిమిషాల్ల పనికి 20,000 డాలర్ల బిల్లు ఎలా ? ఓక ఇంజనీర్ అద్భుతమైన కథ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ మిస్ అవ్వకండి

ఒక పెద్ద ఓడ చెడిపోయింది..

కదలనని మొరాయిస్తోంది..

చాలామంది నిపుణులు వచ్చి చూశారు.

కానీ లాభం లేకపోయింది.

ఎవరూ బాగు చేయలేకపోయారు. ఓడ కదలనంటోంది.

ఊరంతా గాలించి 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజినీర్‌ను వెతికి పట్టుకుని రిపేర్ బాధ్యత అప్పగించారు.

30 నిమిషాల్ల పనికి 20,000 డాలర్ల బిల్లు ఎలా ?

అతను ఓడను పై నుంచి కింది వరకు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు.

అంతా చూశాక ఇంజినీర్ తన బ్యాగ్ తెరిచి చిన్న సుత్తిని బయటకు తీశాడు.

ఇంజిన్ దగ్గరలో ఒక భాగం మీద మెల్లగా కొట్టాడు. వెంటనే, ఇంజిన్ మళ్లీ ప్రాణం పోసుకుంది. సమస్య పరిష్కారమైంది!

ఒక వారం తర్వాత ఇంజనీర్ ఓడ యజమానికి ఆ జెయింట్ షిప్ రిపేర్ చేయడానికి మొత్తం 20,000 డాలర్ల బిల్లు పంపాడు.

ఓడ యజమాని ఆశ్చర్యపోయాడు..

“మీరు చేసింది ఏమీ లేనేలేదు. మహా అయితే అరగంట మాత్రం పనిచేశారు మా కోసం. సుత్తితో చిన్నగా కొడితేనే ఇంజిన్ ప్రాణం పోసుకుంది.. దానికే అంత బిల్లు ఏమిటి? మాకు వివరణ కావాలి.. దేనికి ఎంత ఖర్చో తెలియాలి” అన్నాడు.

ఇంజనీర్ అతనికి సమాధానం పంపాడు:

“సుత్తితో కొట్టడానికి: $ 2

ఎక్కడ కొట్టాలో, ఎంతమేరకు కొట్టాలో తెలుసుకోడానికి: $ 19,998’’

ఒకరి నైపుణ్యం, అనుభవానికి ఇవ్వాల్సిన విలువ అది…

ఎందుకంటే ఎంతో ప్రయత్నం, మరెంతో పట్టుదల, కృషి ఫలితంగానే అనుభవం వస్తుంది.

నేను మీ పనిని 30 నిమిషాల్లో పూర్తి చేసిన మాట వాస్తవమే. కానీ 30 నిమిషాల్లో ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోడానికి నేను 20 సంవత్సరాల పాటు కష్టపడ్డాను.

మీరు నాకు అన్ని సంవత్సరాల అనుభవానికి డబ్బులు ఇవ్వాలే తప్ప, నేను పనిచేసిన 30 నిమిషాలకు కాదు.

NEXT

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *