ఊరకే అయిపోరు అంబానీలు, ఊరకే అయిపోరు కోటీశ్వరులు
ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటే వాళ్ళు మన దేశమైనందుకు గర్వంగా ఉంది…
కొడుకు మాట్లాడుతుంటే తండ్రి ఎమోషనలై కన్నీళ్ళు పెట్టుకోవడం,
వచ్చిన ప్రతీ అతిధిని ముఖేష్ అంబాని స్వయంగా పలకరించడం, ఆయన లేకపోతే కొడుకులు, కోడళ్ళు ఇలా ఎవరుంటే వాళ్ళు…
నాకు అనంత్ అంబాని అయితే చాలా నచ్చాడు… మైసూర్ కెఫే ఓనర్ వస్తే ఆవిడ కాళ్ళకు నమస్కారం చేసాడు…
రాధికను పిలిచి పరిచయం చేస్తే… తను మేం ప్రతీ ఆదివారం మీ ఫుడ్ తింటాం అని చెప్తున్నారు…
తను ఎవరితో మాట్లాడుతున్నా సరే రాధిక, రాధిక అని ఆమెని చాలా హుందాగా పిలిచి పరిచయం చేస్తున్నాడు…
ముఖేష్ అంబాని గాని, నీతా గాని వారిలో ఎక్కడా మాకు ఇంత డబ్బుంది అనే గర్వం లేదు…
ఆ స్థాయిలో ఉన్న చాలా మంది విలువలు మర్చిపోతూ ఉంటారు, కాని ముఖేష్ గారు అయితే చాలా సింపుల్‌గా…
How to Reduce Belly Fat in Telugu 24
వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి జియో రీచార్జులు పెంచారని సోషల్ మీడియాలు కామెంట్స్ చూస్తుంటే నవ్వొస్తుంది…
వాళ్ళకు వ్యాపారం లేని రంగం ఉందా…? వాళ్ళకు సెకన్‌కు వచ్చే ఆదాయం ఎంత…?
ఆ పెళ్ళి ఖర్చు వాళ్ళకు ఒక లెక్కా…? ఇలాంటి వ్యక్తుల వల్లనే దేశం బ్రాండ్ పెరుగుతుంది…
అనంత్ అంబాని ఆహార్యం మీద కామెంట్ చేసే మనం ఆతని వ్యక్తిత్వాన్ని చూస్తే… అతని కాలి గోటికి కూడా సరిపడం…
అనంత్-రాధిక దంపతులకు శుభాకాంక్షలు…
భారత సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటారు… అతిధిని గౌరవించే విషయం గాని భోజనాల విషయం గాని అన్నీ భారతీయమే…
బాంద్రాలో అన్నదానం చేసింది ఎవరూ చెప్పరు…
లాంగ్ లివ్ అంబానీ…!