What are The Causes of Bald-Head in Telugu
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Baldhead, బట్టతల -గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
బట్ట తల రావడా
నికి గల కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది ఏ వయసులో వస్తుంది వివరాలు చూద్దాము
బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి ‘బట్టతల’కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్ అయిన ‘టెస్టోస్టిరాన్’..
జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో ‘డీ హైడ్రో టెస్టోస్టిరాన్’గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే
Natural hair loss treatment at home
What are The Causes of Bald-Head in Telugu
సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
* బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది.
* చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ.
* బట్టతల రావటానికి 80-90 శాతం జన్యు, వంశపారంపర్య లక్షణాలే మూలం.
* తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు
ఇంకా చెప్పాలంటే ఈరోజుల్లో మనం తినే పదార్థాలు, ఇంకా సిటీ లో పట్టణాల్లో బ్రతికి వాళ్లలో ఎక్కువగా ఈ బట్టతల ప్రోబ్లెంస్ చూడొచ్చు ఎందుకంటే పట్టణాల్లో పొల్యూషన్ ఎక్కువ అంతా కృత్రిమమైన వాతావరణం దీనికి తోడు పని వత్తిడి ఇలా చెప్పుతూ పోతే ఎన్నో కారణాలు కనబడుతాయి కాబట్టి వీలైనంత హ్యాపీ ఉంటూ పనిలో వత్తిడి అధిగమిస్తూ పొల్యూషన్ కి కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటె మన ఆరోగ్యం అంతా సంతోషంగా ఉంటది.
IMPORTANT LINKS: