SHARE
stye kanureppalapi gani kannu bayata kurupu vaste

stye , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ)

stye kanureppalapi gani kannu bayata kurupu vaste

ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు (Stye) , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Sty(stye) : కనురెప్పలోపలగాని, బైటగాని లేచిన కంటి కురుపు, సెగ గడ్డ. వీటిలాగనే ఉండే ‘ కెలేజియాన్(chalazion)’ మయిబోబియాన్ గ్రంధులనుండి పుడతాయి . కనురెప్ప లోపలికి purpose అయి ఉంటాయి..లైపోగ్రాన్యులోమా సిస్టు లని అంటారు . నొప్పిలేని నాడ్యూల్స్ గా ఉండి నయమవడానికి చాలా రోజులు పడుటుంది , ఇవి సాధారణముగా కంటి పై రెప్పలో ఎక్కువగా పుడతాయి . స్టై(stye) కనురెప్ప అంచున పుడతాయి.

stye kanureppalapi gani kannu bayata kurupu vaste,Mangu on face

కనురెప్పల మీద కొందరికి కంటికురుపులు వచ్చి మహా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం (sebaceous glands of Zeis)మూతపడటం వల్లగానీ జరుగుతుంది. దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది . ఇటువంటి కురుపులు ఒకరినుండి మరొకరికి అంతువ్యాధి లా సోకే ప్రమాదం ఉంది . కంటికురుపులు వచ్చిన పిల్లలకు వాడిన సబ్బు, టవల్ ఇతర పిల్లలకు వాడకూడదు .

stye kanureppalapi gani kannu bayata kurupu vaste

stye , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ) characteristics (లక్షణాలు) :

 • కనురెప్ప పై అంచున చివరన ఉండే సెబా సియస్ గ్రంథి ఇన్ఫెక్షన్కు గురికావటం వల్ల కురుపులాగా ఏర్పడి, కంటికి ఎంతో బాధను కలిగిస్తుంది.
 • ఇందువల్ల కంటిభాగము ఎఱ్ఱ గా మారిపోతుంది.
 • కనురెప్పపై వాపు ఏర్ప డుతుంది.
 • వాపుతో కూడిన ఈ చిన్నని పుండు కనురప్ప అంచున ఏర్పడడం వల్ల కనురె ప్పలు మూసి తెరచేటప్పుడు ఎంతో బాధాక రంగా ఉంటుంది.
 • కళ్ళు మంట గా ఉంటాయి.
 • కంటిలో ఏదో నలత పడి ఉన్నట్లు ఉంటుంది .
 • కంటి చూపులో తగ్గుదల ఉంటుంది .
 • కంటిలో నీరు , పుసి కారుతుంది .

కారణాలు :

స్టెఫయిలో కోకస్ ఆరియస్ (staphylococcus aureus) బ్యాక్టీరియ వలన కంటి కురుపులు తరచుగా వస్తాయి.

రాత్రులు నిద్ర చాలకపోతే కొన్నాళ్ళకు కంటి కురుపులు వస్తాయి.

సమతుల్య ఆహారం లోపమువలన ,

కంటి శుబ్రత లోపించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

కళ్ళను ఏ కారణము చేతనైనా బాగా రుద్దడం వలన ,

AGE related problems in telugu ఇంటి వైద్యము :

ఒక స్పూన్ బోరిక్ పొడిని పావుకప్పు నీటిలో కరిగించి … ఆ నీటితో కనురెప్పలను రోజులు 4-5 సార్లు కడగాలి.. ఇన్ఫెక్షన్ తగ్గి కురుపులు నయమవుతాయి.

అటువంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

దీనితోపాటు ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.

లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి.

కంటి కురుపుకు చింతకాయ గింజలు రెండు రోజులు నానబెట్టి ఆ గంధమ్ పట్టించాలి. మల్లీ (మరల) ఎప్పడికీ రావు .

ఒక కప్పు నీళ్లల్లో రెండు లేదా మూడు అలమ్ పూసలను బాగా కలిపి, ఆ నీటిని కండ్లు శుభ్రపర్చుకునేందుకు వాడాలి. లేదా

మీరు స్పటిక భస్మాన్ని (ఇది ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతుంది) కూడా వాడవచ్చు. ఇందువల్ల కంటిపై వాపు, ఎర్రబడిన కనురెప్పలు మామూలు స్థితికి వస్తాయి. నీరుకారడం కూడా తగ్గిపోతుంది.

Stye Eye Relief in English Version 

ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పసుపును బాగా మరగ కాచా లి. ఇలా అర గ్లాసు నీళ్ళుండేంతవరకు మరగకాచి, ఈ నీటిని వడగట్టి, ఒక శుభ్రమైన బట్టతో కంటిని శుభ్రం చేసుకొని రోజుకు రెండు లేదా మూడు చుక్కలను కంటిలో వేసుకోవడం వల్ల ఈ సమస్య సమసిపో తుంది. దీనిని ‘ఐ డ్రాప్స్’గా వాడవచ్చు.

ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చిన చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి.

                                                                                Next

1 COMMENT

 1. I see you don’t monetize your page, but you can earn extra cash every day.
  It’s very easy even for noobs, if you are interested simply search in gooogle:
  pandatsor’s tools

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here