అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి మీరు సిగ్గులేని వారు కావచ్చు,నేను కాదు” – రతన్ టాటా ముంబై దాడులకు కొన్ని నెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి.
ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.
Ratan TATAS DESHABHAKTI in 2020
అక్కడి ఆఫీసులో వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్ని గంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి ఒక మంత్రిని కలిసి విషయం వివరించారు.
ఆ వెంటనే ఆ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు. అప్పుడు రతన్ టాటా “మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు” అని చెప్పి ఫోన్ పెట్టేసారు.ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.
Ratan TATAS DESHABHAKTI in 2020
అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక ఆ ఆర్డరును తిరస్కరించారు. అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి. ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే.
- Army Jobs in 2021 in Telangana
- True Love Always Find Its ways 2021
- Incomplete Love Story in 2021
- Latest Singareni Jobs in 2021
- WhatsApp Latest Updates in Telugu 2021
- Urgent Job Openings in Hyderabad
- Happy Journey For Sankranti 2021
- SC Corporation Loans in Telugu 2021
- Latest Hindi Movie Sultan 2021