Podi Podi Vanalu awesome song 2020 Awesome lyrics has written by singer writer, composer Tirupathi Matla and singer Shireesha sang this song awesome super no words Ultimate janapada song in 2020
Podi Podi Vanalu awesome song 2020
పొడి పొడి వానలు కురవంగా.. యెద తడవంగ
నువ్వు దూరంగా గుండె భారంగా.. ఇంత ఘోరం ఎన్నడు కాలేదురో
ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
కండ్లల్ల నీ బొమ్మ గీసుకొన్న.. గుండెల్ల నీ పేరు రాసుకున్న..
సంటి పిల్లోలే నన్ను సూసుకున్న ఆరోజులు మనసుల దాసుకొన్న..
అవి యాదికొస్తే పాణం ఎల్లిపాయే.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
నాగొంతు పొలమారిపోయినట్టు.. అందరున్నా ఒంటరయినట్టు..
గుండె నరాలన్నీ గుంజినట్టు.. ఊపిరొక్కసారి ఆగినట్టు..
ఈ ఎడబాటు నేనెట్ల ఏగుదురో.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
సెలకల్ల ఆట కొయిలాలోలె.. గూటిలో గువ్వగోరింకలోలె..
కలిసున్న మనమెట్ల విడిపోతిమో..
ఏపాడు కండ్లల్ల పడిపోతిమో..