SHARE
computer pi ekkuva sepu work cheste emitundi

కంప్యూటర్ ఫై వర్క్ చేసే వాళ్లకు వచ్చే ప్రోబ్లెంస్ ముందు జాగ్రత్తలు

Laptop Computer Related Health Problems in Telugu

నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి

ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు

ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి ‘టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌’ అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని ‘స్విస్‌’ అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు.

Laptop Computer Related Health Problems in Telugu

వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది.

Laptop Computer Related Health Problems in Telugu

 

ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

Computer Related Health Problems in Telugu తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు :

 • తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, – యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, 
 • పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, – ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, 
 • కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, 
 • సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి.
 • దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, 
 • కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, 
 • ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.
 • ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, 
 • కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, 
 • కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, 
 • ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, 
 • కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి,

        Important links:

        AGE RELATED PROBLEMS IN TELUGU

        BALD HEAD CAUSES IN TELUGU

 

dusserah offers 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here