Kaalam Neetho Nadavadu song Lyrics టైం వేస్ట్ చేసే వాళ్ళకోసం టైం విలువ ఏంటో తెలుసుకునే అద్భుత మైన సాంగ్ విన్నారంటే మారాల్సిందే ఇంతకు మించి టైం గురించి ఏం చెప్తాం Inspirational quotes about life ,Help and
టైం విలువ ఏంటో చెప్పిన అద్భుత మైన song
Work smart smarter not longer
work smarter not harder don’t be lazy be strong
కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము
విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు ,
మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు
ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు
దానికి విలువని ఇస్తే గెలుస్తవు
అది మరిచితే అక్కడే ఆగుతవు
Kaalam Neetho Nadavadu song Lyrics
మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే !!2!!
క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన
సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే
గెలిచిన వీరుని మనసుని అడుగు
సమయం విలువేంటో
గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో
అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా …!!కాలం నీతో !!
ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి !! 2 !!
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం
స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం…..!!కాలం నీతో !!