Inspirational Story For Youth Telugu 2020 inspire and realize the story and find inspirational story about help
జాబ్ రాలేదని కొందరు.. ప్రేమ విఫలం అయ్యిందని కొందరు.. కడుపునొప్పి అని మరి కొందరు.. ఇలా కారణాలు ఏమైనా.. ఆత్మహత్యే పరిష్కారం అనుకొనే నేటి యువతీ యువకులకు ఆదర్శం ఈ 70 ఏళ్ల మహిళ జీవితం…బతుకు కోసం ఒంటరి ప్రయాణం…ఎవరికి తలవంచని ధీరత్వం.. ముసలి తనం మీదపడుతున్నా..
దేహం ఉంది..! నెత్తురుంది…! సత్తువుంది…! ప్రాణముంది..!
Inspirational Story For Youth Telugu 2020
జీవన పోరాటానికి ఇది చాలవా అనుకొన్న ఆమెకు జీవన పోరాటానికి వేరే సైన్యం అవసరమా…? కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఒకరి మీద ఆధారపడి జీవనం సాగించే గుణం కాదు ఆమెది.. కన్న కొడుకు తల్లిని చేరదీసే నైజం ఉన్నా.. అతని వద్దకు చేరని ధీరత్వం గుంటూరులో నివాసం ఉండే యల్లమందమ్మది… డైబ్బై ఏళ్ల యల్లమందమ్మ తెల్లవారగానే సద్ది కట్టుకొని గడ్డి కోసం సైకిలెక్కి 4 కి.మీ ప్రయాణిస్తుంది. గడ్డిమోపు తీసుకొచ్చి రూ.100లకు అమ్ముతుంది. ఇలా నాలుగేళ్ల నుంచి ఈమెకు జీవనాధారం.
విశేషమేంటంటే దారిలో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో దగ్గర్లోని తెనాలి రైలు ట్రాక్‌పై (రోజుకు మూడు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగించే ట్రాక్) గడ్డిమోపుతో ఉన్న సైకిల్‌ను తోసుకుంటూ వస్తుంది. ఎంతో అనుభవం ఉన్నవారికీ సాధ్యం కాని
Inspirational Quotes For Love and Friendship etc…
ఈ పనిని సునాయాసంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈమె గమనం నిజంగా ఆదర్శనీయం.. కాగా యువతీ యువకులే ఉద్యోగం లేకపోతే కూర్చుని తినాలి అనుకొంటున్న సమయంలో కూర్చుని తినే వయసులో కష్టపడి బతుకుతున్న యల్లమందమ్మకు హృదయ పూర్వక పాదాభివందనం….
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చితే మా షేర్ చేయండి.
- Love 3 Types of People in our Lifetime
- Latest Inspirational Quotes About Life 22
- Difference Between Fake Love and True Real Love
- Never Do This In Your Life in Telugu
- Lockdown Continues as NSW Records 38
- COVID-19 Latest Update of Coronavirus
- COVID-19 Corona Virus Effects in the world
- COVID-19 Precautions IN 20212nd wave in Telugu
- Himadas Got DSP Post In Assam 2021
- Ala Chusano Lyrics in Telugu 2021
- Valentines day 2021 Find Who IS Rich
- Machilipatnam Srikanth Achievement in Telugu 2020
- Hyderabad Roads Closed Rains 2020
- Kaalam Neetho Nadavadu song Lyrics