SHARE
Husband Wife Story in Telugu 2020
more news

Husband Wife Story in Telugu 2020అనేక మలుపులతో కూడిన ఓ భార్యాభర్తల కథ.

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది. క్యాషియర్ ఆమె బ్యాగ్లో ఒక టీవీ రిమోట్ గమనించాడు.

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు. “మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?”అని.

 ఆమె “లేదు, ఎప్పుడూ కాదు. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా…”  అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.

 నీతి: మీ భార్య మాట వినండి. ఇంకా, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి…..

కథ ఇంతటితో అయిపోలేదు …

Husband Wife Story in Telugu

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయి “ఏమైంది..!!” అని క్యాషియర్ని అడిగింది.

 అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు …..”

నీతి: మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.

కథ కొనసాగుతుంది ….and other inspirational story about help in telugu

భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.

 నీతి: మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..

 కథ ఇంకా అయిపోలేదు … inspirational story for youth

స్వైప్ చేసిన తర్వాత, యంత్రం ‘మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి’ అని సూచించింది …….

 నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత రక్షిస్తుంది..!

కథ కొనసాగుతుంది ….

ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.

Husband Wife Story in Telugu

అది తన భర్త ఫోన్. ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.. ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసుగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.

 నీతి: ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు!

 కథ కొనసాగుతుంది ….

ఆమె ఇంటికి చేరుకునేసరికి బయట అతని కారు లేదు.

ఒక నోటు తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసుంది…

“రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యు….”

 ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు

  నీతి: మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.

10th class jobs 10TH CLASS JOBS IN TELUGU actors Actress age related problems Anganwadijobs Anganwadi Jobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES coronavirus attacks covid-19 COVID 19 ASTROLOGY fathers day wishes google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs Inspirational quotes Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs latest jobs love story Medical jobs memes in telugu movies Part Time Jobs police jobs RRb jobs RTC jobs ssc jobs Whatsapp Wishes Work from home Work from home without investment

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here