SHARE
Himadas Got DSP Post In Assam 2021
Find more inspirational

Himadas Got DSP Post In Assam 2021 హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించినది.  అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన తరువాత కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించినది. ఈ బంగారు పతకం జూనియరు విభాగంలో పొందిన సీనియరు, జూనియరు విభాగాల్లో బంగారు పతకంపొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్

HIMADAS KI హిమ దాస్ ని ఇప్పుడు అస్సాం డీస్పీ గ DSP పోస్ట్ ఇచ్చారు

Himadas story in Telugu

18ఏళ్ల హిమదాస్‌ అసోం లోని నాగయోన్‌ జిల్లాలోని ఢింగ్‌ గ్రామానికి చెందిన హిమదాస్‌ రైతు కుటుంబంలో జన్మించింది.తండ్రిపేరు రొంజిత్ దాస్ ,తల్లి పేరు జొనాలి దాస్.కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్‌ ప్రపంచ ట్రాక్‌ ఈవెంట్‌ ప్రస్థానం అంచలంచలుగా సాగింది. తండ్రితో పాటు పొలంపనికి వెళ్లేది.ఆమె జననం 9 జనవరి 2000.నలుగురు పిల్లలున్న కుటుంబం లో అందరికంటే చిన్న అయినా, బరువు భాధ్యతలు మాత్రం ఎక్కువే. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్‌ ప్రపంచ ట్రాక్‌ ఈవెంట్‌ ప్రస్థానం అంచలంచలుగా సాగింది. తండ్రితో పాటు పొలంపనికి వెళ్లేది

Himadas history in telugu 2021
himadas

హిమదాస్ దింగ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించి,చిన్న పిల్లగానే ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించింది. ముందుగా ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించినా, తన పరుగును గోల్ పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది.స్కూలులో వున్నప్పుడు అక్కడి మగపిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడేది.మొదట్లో ఫుట్ బాల్ ఆటనే తన గమ్యంగా ఎంచుకుంది. నవోదయ విద్యాలయకు చెందిన ఫిజికల్ ఎడుకేసన్ ట్రైనర్ అయిన సాంసుల్ హోక్వ్(Shamsul Hoque)సలహతో తన అభిరుచిని ఫుట్ బాల్ నుండి తక్కువ దూరం రేసుల్లో పరుగెత్తడం ప్రాక్టిసు మొదలెట్టింది. సాంసుల్ హోక్వ్ హిమదాస్ ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేసకు చెందిన శంకర్ రోయ్ కు పరిచయం కావించాడు. ఇంకా వేగంగా..ప్రపంచంలో అందరికంటే వేగంగా కేవలం 18 ఏళ్ళ వయసులో ప్రపంచాన్ని జయించింది. భారతదేశ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగరవేసింది.నిపోన్‌దాస్‌ అనే కోచ్ దొరకటంతో అమెకు సరికొత్త క్రీడ జీవితం మొదలైంది.ఆమె విజయకాంక్షకు అనుగుణంగా నిపోన్‌దాస్‌ రూపంలో స్ఫూర్తిని ఇచ్చే గురువుదొరికాడు. జిల్లా స్థాయిపోటీలలో చౌకరకం దుస్తులు,షూలతోనే 100మీటర్లు200మీటర్లులో బంగారు పతకాలు పొంది తమ జిల్లాను ప్రథమస్థానంలో నిలిపారు.హిమదాస్ అంతరు జిల్లా పోటీకి ఎన్నిక అయ్యి రెండూ బంగారు పతకాలను సాధించింది.

ఈ పోటీల్లో దాస్ ప్రతిభను డైరెక్తరేట్ అఫ్ స్పొర్ట్స్ అండ్ యూత్ వెల్ఫెర్ కు చెందిన అథ్లెటిక్ కోచ్ అయిన నిపోన్ దాస్ గుర్తించాడు.హిమదాస్ తల్లి దండ్రులను ఒప్పించి అమెను గౌహతికి తీసుకెళ్లాడు.మొదట్లొ అద్దె ఇంట్లో వుంటూ ప్రాక్టిసు చేసేది.అలా అయినచోఅనుకున్న లక్ష్యం సాధ్యం కాదని గ్రహించిన నిపన్ దాస్ అమెను సరుస జాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు హస్టల్ లో చేర్పించాడు.100, 200 మీటర్ల పరుగు పందెంలొ మెరుపులు మెరిపించిన హైమదాస్ ను నిపన్, సహకోచ్ నవజీత్,అమెను 400 మీటర్ల కేటగిరికి మార్చారు.

Himadas Got DSP Post In Assam 2021

2018 మార్చిలో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ పాల్గొన్నది.400మీపరుగు, 4X400 మీ రిలే పోటీలో భగస్వామ్యం వహించింది.400 మీటర్ల ఫైనల్లో తలపదిన అమె 51.32 సెకన్లలో చేరి ఆరవ స్థానంలో నిలిచింది..పసిది పతకం పొందిన అమంట్లే మొంట్శో(బోట్స్‌వానా)కన్న కేవలం 1.17 సెకన్లు మాత్రమే తక్కువ .

వ్యక్తిగత ఉత్తమ స్కోరు

జూన్,2018 నెలలో గువాహాటిలో జరిగిన ఇంటరు స్టేట్(అంతరరాష్ట్ర)చాంపియన్ షిప్పులో 400మీటర్ల దూరాన్ని 51.13 సెకన్లలో చేరిం.

ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్‌-2018

ఫిన్ లాండ్ లోని టంపెరె(Tampere)లో 12 వతేది గురువారం జులై 20187న ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన 18 ఏళ్ల హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది. 400మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది.4వనెంబరు లైనులో పరుగుపెట్టిన హిమదాస్‌ రుమేనియాకు చెందిన ఆండ్రియా మిక్క్లోస్‌ కన్నా మొదట వెనకపడింది. 50 నుండి 100 మీటర్ల మధ్యలో ఆండ్రియాతో వెనకబడిన హిమదాస్‌ ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది.

ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్ల‌తో రజతం గెలవగా.అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది.

మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలెట్టిన కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించినది.ఈ బంగారు పతకం జూనియరు విభాగంలో పొందిన సినియరు, జూనియరు విభాగాల్లో బ<గారు పతకంపొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్

LATEST POSTS READ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here