Dr B R Ambedkar Life History in Telugu భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు.బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు. ఇతని తండ్రి భారత దేశానికి మోహో సైనిక స్థావరంలోని బ్రిటీష్ సైన్యంలో పనిచేసి సేవలు అందించాడు.
భీమ్రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవాడు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.
Dr B R Ambedkar Life History in Telugu
బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య: మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్కు రాలేకపోయాడు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్రావ్ ను అవమానాలకు గురిచేశారు.రామ్జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు.భీమ్రావ్ ఎల్ఫిన్స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు.
విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష: బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు.పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత “ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా” అను పేరుతో ప్రచురించబడింది.1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చాడు.అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
Dr B R Ambedkar Life History in Telugu
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు!కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ ‘మూక నాయక్’ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు.సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ ని పై చదువులకి విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీసు జవానులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూచారు.
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
దళిత మహాసభ (1927) : 1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా. అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.
1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. ‘ అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.

పరిష్కారం: భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తీ స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజము యొక్క ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమజములో ఉన్నదని ఆయన సమర్ధించాడు. అయితే అంటరానివారుగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొనెను. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
Dr B R Ambedkar Life History in Telugu
దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలపై గాంధీ vs అంబేద్కర్- పూనా ఒప్పందం: 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,, 1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయము కుదరక పోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ “కమ్యూనల్ అవార్డు”ను ప్రకటించడం జరిగింది.
దీని ప్రకారం దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధి శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నారు. ఈ ప్రకటన గూర్చి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. అంబేద్కర్ పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి ‘హరిజన్ సేవక్ సమాజ్’ ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరాని తన నిర్మూలనలో గాంధి కున్న చిత్తశుద్ధి మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధి ఉద్యమమునుండి బయటకు వచ్చి ప్రత్యేఖముగా దళిత సమస్య పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసారు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్: రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ ‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
Dr B R Ambedkar Life History
బౌద్ధమును స్వీకరించుట: అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.1956 అక్టోబరు 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు.హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి.ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న కన్ను మూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న ‘ అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- Jeevitham Maaripoye Quotes in Telugu
- Pogadtalu Vimarshalu Bavishyavani in telugu
- Dr B R Ambedkar Life History in Telugu
- Tomorrow Fruit Markets are Closed Why
- Lockdown Good Works in 2020
- Inspirational Story About Help 2020