Corona virus Symptoms and How it Attacks ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టింది. అయితే, హైదరాబాద్‌కి చెందిన వ్యక్తికి కూడా ఈ లక్షణాలు కనిపించగా.. ప్రతి ఒక్కరూ కరోనా అంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే..వ్యాధి గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం..
Corona virus Symptoms and How it Attacks
- Also read :
కరోనా వైరస్ లక్షణాలు..
ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది.
తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు ఉంటే ఏమి చేయాలి :
ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలి.
ఎలా వ్యాపించవచ్చు :
ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది.
వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్క వారికి వచ్చే ప్రమాదం ఉంది.
వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది.
రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
Corona virus Symptoms and How it Attacks
Read
సోకితే ఏమవుతుంది ? Stye on Eye in english
ఈ వైరస్ సోకితే శ్వాసవ్యవస్థను నిర్వీర్యమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి పలు నగరాల్లోని ప్రజా రవాణాను చైనా నిలిపివేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను మూసివేసి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో వైరస్ వ్యాప్తి కొంత నెమ్మదించింది.
ఎప్పుడు మాస్క్ ధరించాలి : చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది.
ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి
జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
కరొనా వైరస్ వ్యాపించిందింటే కొన్ని రకాల ట్రీట్మెంట్ ద్వారా దీనికి చికిత్స చేయొచ్చు.
నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే, పిల్లలకు మాత్రం, ముఖ్యంగా నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వకూడదు.
ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
Important LINKS: Also Read :
- సినిమాల నుంచి రాజకీయమ్
- రిపబ్లిక్ డే అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు
- పోలీసులు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా
- పెంచిన తెలంగాణ ప్రభుత్వ పింఛను పూర్తి వివరాలు
- ఇవి ఏ హీరోయిన్ కళ్ళు ఈ కళ్ళు ఎలా ఉన్నాయి
- ఆదివారం నుంచి మే 17వరకు ప్రారంభం కానున్న రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు
- అబ్బాయిని పుట్టించలేదని భార్యకు విడాకులిచ్చిన భర్త
- YSRCP Jagan MohanReddy Navarathnalu
- YSR Yatra Movie Public Review Here
- YS Jagan Mohanreddy CM AP 2019
- Wow Wonderful Technology video
- Work From Home Part Time Genuine Telugu 2020