SHARE
పోలీసులు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా CORONA VIRUS
more about corona virus

పోలీసులు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించాక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు హృదయ విదారకం.పోలీసులు ప్రజల్ని లాఠీలతో బాదడం కొందరికి అమితానందాన్ని కొందరికి భాధను కలిగించాయి.నిన్నటి పెరవలి ఎస్సై ఘటన బాగా చర్చకు దారి తీసింది. ఆ విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న చర్చ చేద్దాం..పోలీసు ఉద్యోగాలకు తెల్లవారుజామున రన్నింగ్. దేహ దారుఢ్యము

పోలీసులు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా

శారీరకంగా బలమైన వాళ్లనే ఎంపిక చేసుకోవడం ఇందులో ఒక ఆనవాయితీగా వస్తున్న ఎంపిక.ట్రైనింగ్ సంగతి తెలియదు కానీ ప్రజా సంబంధాలు మీద ఎటువంటి అవగాహన కలిగి ఉంటున్నారు పోలీసు శాఖ?స్టేషన్లకు వచ్చే వారిని స్థాయిని బట్టి రూములో, లేదా బయట కూర్చోబెట్టే విధానం అందరికీ తెలిసిందే..కొందరిని నుంచో బెడతారు కూడా.ఈ తంతు మొత్తంలో సర్వీస్ గడుస్తూ ఉండగా సహజంగానే వచ్చే ఒక ఆధిపత్య ధోరణి, లా మీద అవగాహన లేని ఆర్ధికంగా సామాజికంగా వెనుకబడ్డ వారిని క్రమేపీ తమ ఆధిపత్య ధోరణి భాదితులుగా మార్చేస్తారు..

Lock down Support POLICE

మానవ సంబంధాలు వాటి విలువ మోరల్స్ వీటిపై వారికిచ్చే శిక్షణ ఏమిటో తెలియదు. టెక్నాలజీ హ్యూమన్ రైట్స్ అంశాలు విరివిగా వాడుకలోకి వచ్చాక డిజిటలైజ్ మరియు కౌన్సెలింగ్ యుగం వచ్చిన తరువాత, పోలీసు శాఖలో ఒక సున్నితత్వం మెల్లగా అలవడింది. అందులో భాగంగానే కొన్ని పోలీసు స్టేషన్లు కౌన్సెలింగ్ ద్వారానే కొన్ని సమస్యలకు పరిష్కారం వెతికే ఆధునిక వేదికలయ్యాయి.

అయితే పేద వర్గాల పట్ల పోలీసు శాఖలో ఉండే అభిప్రాయం ఎవ్వరికీ తెలియనిది కాదు.

వైద్యులు పరిశోధనలకు పేద జనాల శరీరాలు ఉపయోగించినట్టు, కొందరు పోలీసుల ఫ్రస్టేషన్ ఈ వర్గాల శరీరాల మీద తీరుతూ ఉంటుంది.

పోలీసులు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా

CORONA VIRUS EFFECTS IN THE WORLD ఇప్పుడు కరోనా టైమ్స్ కు వద్దాం.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లాఠీ ఛార్జ్ లు లేదా బయటికి వచ్చిన వ్యక్తుల మీద జరుగుతున్న పోలీసు శాఖ దేహశుద్ధులు ఏ ఫలితాన్ని ఆశిస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి..పోలీసులు విపరీతంగా కొట్టడం తో బెంగాల్ లో ఒక మనిషి చనిపోయారు..

“గుజరాత్ ఫైల్స్” పుస్తకం రాసిన రానా ఆయూబ్ మాట్లాడుతూ “కరోనా మరణాల కంటే మీ చేతిలో దెబ్బలు తిని మరణించే వారి సంఖ్య పెరుగుతుందేమో జాగ్రత్త” అని వ్యాఖ్యానించారు..

ఇక ఏపీ కే వస్తే పెరవలి లో జరిగిన సంఘటన

అక్కడక్కడా జరుగుతున్న చెదురు మదురు సంఘటనలు వేరు వేరుగా చూడాలి..

ఒక మూకని చెదరగొట్టడం వేరు..

ఒక మనిషిని తనిఖీ చేసి పంపించడం వేరు..

పెరవలి సంఘటన మూకలను చెదరగొట్టడం కాదు. ఒక వ్యక్తి మీద తమాయించుకోలేని కోపం తో చేసిన దాడి లా నేను భావిస్తున్న..

ఆ దెబ్బలు కొట్టడం ఏమిటి?

ఆ భాష ఏమిటి?

అక్కడున్న మహిళను కొట్టడం ఏమిటి?

అతను దుబాయ్ నుండి వస్తే హోమ్ క్వారాంటైన్ పాటించకపోతే కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గ దర్శకాల ప్రకారం

ఎవరూ ఆ నిబంధనలు ఉల్లంఘించిన అతనిని అదుపులోకి తీసుకోవచ్చు..

అనుమానం ఉన్న వారిని టెస్ట్ లకు పంపే అధికారాన్ని కట్టబెట్టాయి ఆ మార్గ దర్శకాలు..

అది పట్టించుకోకుండా అతను బయట తిరిగాడని పోలీసులను తిట్టాడని విధులకు ఆటంకం కల్గించాడు అని కొట్టడం సహేతుకంగా లేదు.

అతను పరిధి దాటి ప్రవర్తన చేసినట్లైతే అదుపులోకి తీసుకోవాలి..

ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది..

అదేమిటంటే పోలీసులు బయటికి వచ్చిన వారిని కొట్టడం వల్ల జరిగే అనర్ధాలు..

కొందరు పోలీసులు డైరెక్ట్ గా కొందరిని చెంప మీద కొడుతున్నారు..

కొందరు చేతులు పట్టుకుంటున్నారు..

కొందరు లాఠీలతో కొడుతున్నారు..

ఆ కరోనా వైరస్ బట్టల మీద ఇన్ని గంటలు బ్రతికి ఉంటుంది..

శరీరం మీద ఇన్ని గంటలు ఉంటుంది అని చెబుతున్నప్పుడు మనిషికి మనిషికి మధ్య దూరం ఉండాలి అంటున్నప్పడు

బయటికి వచ్చిన వారిని డైరెక్ట్ గా కొట్టడంతో ఒకవేళ వారి బట్టలు లేదా శరీరం మీద వైరస్ ఉంటే అది క్రమంగా ఆ చేతులు లేదా లాఠీల ద్వారా ఇతరులకు సోకె ప్రమాదం ఉంది..

ఈ సెన్సిటివిటీనీ మర్చిపోతుంది పోలీసు శాఖ..

శ్రీ రెడ్డి ఇష్యు జరిగినప్పుడు బాబు గోగినేని మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు..

అప్పుడు ఈమె ఏమైనా ప్రతీవ్రతా అని కొందరు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..

“ఆమె ప్రతీవ్రత అయితే కొత్తగా హక్కులేమీ రావు. ప్రతీవ్రత కాకుంటే హక్కులేమీ పోవు” అని.

ఈ లోకంలో జరుగుతున్న ప్రేరేపిత ఆధిపత్య భావన రూపంలో ఈ వ్యాఖను అర్ధం చేసుకుంటే

సున్నితత్వం మరచి, పోలీసింగ్ చేస్తే వైరస్ పోలీసులు కదా అని అంటుకోకుండా ఉండదు..

CORONA VIRUS PREVENTION IS BETTER

లేదా పేద వాళ్ళు కదా అని వదిలిపోదు..

కరోనా ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక భయానక వాతావరణం ఇప్పుడు ప్రజలను ఆవహించి ఉంది..

పోలీసులే రక్షకులుగా ఉండాల్సిన చోట భయానక వాతావరణం సృష్టించడం తో పుట్టేది భయమే కానీ ఇంకేం కాదు..

కొట్టుకుంటూ పోతే మిగిలేది శరీరాలు కాదు శవాలు..

ఈ విషయం తెలిసాక చాలా మంది అంటున్నట్టు

దుబాయ్ నుండి వచ్చిన ఇతని ఇంటికి వెళ్లినట్టే అగ్ర వర్ణాల ఇళ్ళకి వెళ్లి తన్నుకుంటూ తీసుకు రాగలరా?

ఎందుకంటే ఈ వైరస్ కి కుల మత భేదాలు లేవు కదా .

అంతెందుకు రాజధాని (అమరావతి) గ్రామాల్లో కొందరు ఫారిన్ నుండి వచ్చి కనబడకుండా పోయారని వార్తలు చూస్తున్నాం వారిని పట్టుకొని ఇలాగే తీసుకురాగలరా?

గుంటూరు లో ఒక ప్రజా ప్రతినిధి బామ్మర్ది విషయం బాగా పాపులర్ అయ్యింది.

ఆయన ఇంట్లో ఉండకుండా విందుకు వెళ్తే టెస్టుల కోసం ఆయనను ఇలాగే తీసుకెళ్లారా?

ఎన్నాళ్ల నుండో పోలీస్ శాఖ లో దేహ దారుడ్యం ఈవెంట్స్ వదిలేసి సైకాలజీ ఇంకా పబ్లిక్ రిలేషన్స్ ఇష్యుల మీద పరీక్ష జరిపి ఎంపికలు చేయాలి అని ఒక ప్రతిపాదన ఉంది.

ఆ సమయం బహుశా ఇదేనేమో..

పోలీసు శాఖకు ఒక్కటే విజ్ఞప్తి..

పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం ఇప్పటి అవసరం.

మూకలను చెదరగొట్టాలి..

వ్యక్తులను హెచ్చరించాలి..

మాట వినకుంటే చట్టం ప్రకారం అదుపులోకి తీసుకోవాలి..

రానా ఆయూబ్ చెప్పినట్టు “కొట్టుకుంటూ పోతే కరోనా కంటే లాఠీ మరణాలే ఎక్కువవుతాయి”

ఇప్పుడు మీ నుండి కోరేది వైరస్ ఎవరికీ సోకకుండా చేసే “Sensitive Policing” .

పోలీసు శాఖ “సున్నితత్వం ప్రదర్శించాల్సిన సమయం” . ఎంత సున్నితత్వం అంటే మీ సర్వీస్ లో ఎప్పుడూ చూపనంత సున్నితత్వం.

హెచ్చరించండి.

వైరస్ గురించి బెదిరించండి..

బాదకండి..

ఇక్కడ నేరస్థుడు కరోనా.. మనిషి కాదు.

ప్రజలు పోలీసులకు సహకరించండి. సమస్య గా మారకండి..

వైరస్ సోకే విధానం తెలుసుకోవడానికి

2011 లో వచ్చిన “Contagion” మూవీ

లేదా ఇటీవల నిఫా వైరస్ పై మలయాళం లో వచ్చిన “Nifah” సినిమా చూడండి..

పోలీసు శాఖ సిన్సియారిటీ, ప్రజల అవసరాలు కరోనా కు పట్టవు. ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి..

ఎకరం స్థలంలో స్విమ్మింగ్ ఫూల్ కట్టుకున్న వాడు, ఇంటి నిండా పనోళ్లు ఉన్న వాడు, ఇంట్లో ఉండి ఏ లైవ్ అయినా పెడతాడు..

సెంట్ భూమిలో ఇల్లు కట్టుకున్న వాడికి రోజు గడవాలంటే ఏదొక పని చేసుకోవాలి. లేదా అవసరానికి బయటికైనా రావాలి..

ఈ సున్నితత్వాన్ని ఆలోచించండి.

చావడానికి ఎవడూ ఎగేసుకొని బయటికి రాడు. ఈ వాస్తవాన్ని గుర్తించాలి.. ఎదుటి మనిషిని కొడితే కామెడీ వీడియోలు చేసే పైశాచిక ఆనందం నుండి బయటికి రండి మానవులరా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here